* ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో శాంతి దినోత్సవం నిర్వహించారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు కూడా విచ్చేశారు. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఒకే వేదికపై జ్ఞానం చేశారు. శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్ ద్వారా లక్ష మందితో ధ్యానం చేయనున్నారు. ఆన్ లైన్ లో ధ్యానం కోసం meditation.glebal/enలో లాగిన్ కావాలి. ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చని కమలేష్ డి పటేల్ (దాజీ ) తెలిపారు. ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చునని అన్నారు. మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఏకాగ్రత ద్వారా సునాయాసంగా విజయాలు సాధించవచ్చునన్నారు. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముందుగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు అభినందనలు తెలిపారు. శాంతి, సామరస్యం, ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తోందని తెలిపారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం పని చేస్తుందన్నారు. ధ్యానం చేస్తున్న వారి మనసులో ఏకాగ్రత ఉంటుందని, ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. డిసెంబరు 21న ప్రపంచ ధ్యాన దినంగా యూఎస్ ఓ ప్రకటించిందని గుర్తు చేశారు. యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. భారతదేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ణించారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని వెల్లడించారు. వికసిత్ భారత్ లో ఆర్థికాభివృద్దే కాదు.. దేశం శాంతి భాగంగా ఉంటుందన్నారు.
………………………………………
