– సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : సమ్మక-సారక్కలు మనుషుల్లో దేవుళ్ళని సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సారక్క గద్దెల ఆధునీకరణ పనులు దైవసంకల్పమని, ఒక సత్కార్యామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల అభివృద్ధిలో భాగంగా ఉపయోగించిన చిహ్నాలను వాటి అర్థాలను తెలిపే వీడియోను సీఎం పోస్ట్ చేశారు. సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర గద్దెల ప్రాంగణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల్లో తూర్పు ఈశాన్య ఆర్చ్ ను సమ్మక్క తల్లి ఆర్చిగా ఏర్పాటు చేశారు. ఈ సమ్మక్క తల్లి ఆర్చి నుంచే గుడిలోకి భక్తుల ప్రవేశం ఉంటుంది. ఇందులో ఎడమవైపు పిల్లర్ చాలా ముఖ్యమైనది. ఈ రాతి పిల్లర్ పైన ఉన్న చిహ్నలు సమ్మక్క తల్లి యొక్క వంశం గురించి తెలుపుతాయి. మొదటి బొమ్మ ఐదు పలకలు ఉంటాయి. అది సమ్మక్క తల్లి ఐదవ గొట్టు వారి రాజ్యం చిహ్నం. రెండవ చిహ్నం త్రిశూలాని పోలి ఉండి పూర్వకాలంలో కోయలు ఏ వంశానికి చెందినవారు,ఏ గొట్టు అని గుర్తు పట్టడం కోసం సమ్మక్క తల్లి వంశం నుదుటి బొట్టు,
మూడవ చిహ్నం ఐదు నిలువ గీతాలు
సమ్మక్క తల్లి ఐదవ గొట్టుకు చెందిందని,
ఐదవ చిహ్నం నక్షత్రాకార చిహ్నం సమ్మక్క తల్లి నక్షత్రం ఆకాశంలో ఉంటుందని తెలిపే గుర్తు,
స్వస్తిక్ గుర్తు సిద్దబోయిన వారు పూజా విధానంలో ఉపయోగించే గుర్తు, ప్రకృతిని దైవంగా భావించే గుర్తుగా స్వస్తిక్ ని ఏర్పాటు చేశారు. దీని అర్థం భూమి, గ్రహాలు, సుడిగాలి , సుడిగుండం కుడి నుంచి ఎడమవైపుకు తిరుగుతాయి అని చెప్పే ప్రకృతి సిద్ధాంతం. అన్నింటికంటే దిగువన ఆదివాసీల ఆలయ ప్రాంగణం అనేలా ఉన్న గుర్తు. అడవి దున్నలు, కొమ్ములు నెమలిపించాలతో కోయ నృత్యం వేస్తున్న సందర్భాన్ని తెలుపుతుందని ఇలా సమ్మక్క సారల సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలోని ప్రతి పిల్లలకు ఒక చరిత్ర ఉందని వీడియోలో తెలిపారు.
………………………………………………….

