* తెలంగాణపై కేంద్రం అడుగడుగునా వివక్ష
* టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC PRESIDENT MAHESH KUMAR GOUD) అన్నారు. కిషన్ రెడ్డి (KISHANREDDY) కేంద్రమంత్రై రాష్ట్రానికి చేసిందేమిటో వివరించాలని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీనిచ్చిందని, 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కిషన్ రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమెను ప్రశ్నించే స్థాయికి కిషన్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతోందన్నారు. మోదీని ప్రశ్నించే సామర్థ్యం లేని కిషన్ రెడ్డికి, సోనియాగాంధీ(SONIAGANDHI)కి లేఖ రాసే అర్హత లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయాలే కాంగ్రెస్ (CONGRESS) ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
…………………………………………………..

