* ఇబ్బందులు పడుతున్న భక్తులు
ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ జాతర ముందు ఉన్నప్పటికీ భక్తుల రాక ముమ్మరంగా కొనసాగుతుంది అయితే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం మహా జాతర జనవరి చివరి వారంలో జరగనున్నప్పటికీ ఇప్పటినుంచే భక్తుల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం జాతర అమ్మవార్ల గద్దెల ఆవరణలో పునఃంనిర్మాణ పనులు తోపాటు పరిసరాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి నుంచే భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. దీనితోపాటు వాహనాల రాకపోకలతో దుమ్ము దూళితో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవతల గద్దెల ముందు ఐలాండ్ సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా సిసి రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిసి రోడ్లపై భక్తులకు రాళ్లు కుచ్చుకున్నప్పటికీ అత్యంత విశ్వాసంతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు ముందు వరుసలో వెళ్తున్నారు ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి పనులు ను సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు. పోలీస్ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు అయినప్పటికీ పనులు మందకొడిగా సాగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ భక్తుల మొక్కులపరంపర కొనసాగుతోంది.

……………………………………………………………..
