* కోడిగుడ్ల వ్యాపారి దారుణహత్య
* నల్గొండ జిల్లాలో కలకలం
ఆకేరు న్యూస్, నల్లగొండ : నల్గొండ జిల్లాలో కోడిగుడ్ల వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. నకిరేకల్ తిప్పర్తి రోడ్డులోని బస్టాప్ వద్ద వ్యాపారి వెంకన్న (51)ను హత్య చేసి చంపేశారు. పాల ట్రేలతోనే వెంకన్నను కొట్టి దుండగులు చంపేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………
