* కేసీఆర్ కు నోటీసులంటూ డైవర్షన్ ప్లాన్
* ఆయన గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ములేపాయే
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (BRS WORKING PRESIDENT KTR) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోజుకో కేసు అంటూ రెండేళ్లుగా లీకులు ఇస్తున్నారని, కెమెరాల ముందుకు వచ్చే దమ్ము ఆయనకు లేదని అన్నారు. చిట్ చాట్ల పేరుతో వెనక దాక్కోవడం కాదన్నారు. దమ్ముంటే బయటకు వచ్చి కేసులపై మాట్లాడాలని సవాల్ విసిరారు. మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ (KCR) గర్జిస్తే దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా అన్నారు. పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపితే మాట్లాడే దిక్కులేదన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నామంటూ, డైవర్ట్ చేయాలన్నదే సీఎం ప్లాన్ (CM PLANE) అని తెలిపారు. పథకాలపై ఎవరూ అడగొద్దనే ఇటువంటి లీకులు ఇస్తున్నారని అన్నారు. సీఎం హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పులతో అభివృద్ధి చేస్తే రేవంత్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాగ్ లెక్కల్లోఅసలు నిజాలు తేలాయని వెల్లడించారు.
……………………………………………………..

