ఆకేరు న్యూస్, ములుగు: మేడారం ఆదివాసి ఆరాధ్య దేవాలయం సమ్మక్క సారలమ్మ పగిలిద్దిరాజు గోవిందరాజు ల గద్దెలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం దర్శించుకుని పసుపు కుంకుమ బంగారం బెల్లం సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించి ఆశీర్వాదం పొందారు. పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం కమిషనర్ కు అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు .అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ వచ్చే నెలలో జరగనున్న మేడారం మహా జాతరకు చేపడుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ను అడిగి తెలుసుకున్నారు.
అమ్మవార్ల గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో రాతి శిల్పాల నిర్మాణం పనులను పరిశీలించి వాటి విశిష్టతను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జాతర ముందు ఉన్నప్పటికీ భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో హాజరవుతున్నారని ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డి శివం ఉపాధ్యాయ డిఎస్పి రవీందర్ పస్రా సిఐ దయాకర్ స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లతోపాటు వరంగల్ ములుగు పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..

