* మావోయిస్ట్ అగ్రనేత ఉయికే గణేష్ మృతి
* భద్రతాదళాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
* ఒడిశాలో కొనసాగుతున్న కాల్పులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఒడిశాలో భదతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కీలక నేత గణేశ్ ఉయికే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిపై రూ.1.10 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. గణేశ్ తో పాటు ఛత్తీస్గఢ్లో ఇటీవల పలువురు అగ్ర నాయకులతో సహా పలువురు మావోయిస్టులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారని సమాచారం. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సీఆర్ పీఎఫ్ బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు రెండు INSAS రైఫిల్స్, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నాయి.
……………………………………………………

