* విస్తరిత జీహెచ్ ఎంసీకి తుదిరూపు
* ఫలించిన వినతులు, పోరాటాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహ మహానగరానికి తుది రూపు ఖరారైంది. అభ్యంతరాలను, వినతులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. సర్కారు తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న జోన్లను, సర్కిళ్లను రెట్టింపు చేశారు. పాత జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉండగా, ప్రస్తుతం 12కు పెంచారు. గతంలో 30సర్కిళ్లు ఉండగా.. విస్తరిత జీహెచ్ఎంసీ పరిధిలో 60 సర్కిళ్లు నిర్ణయించారు. తర్జన భర్జనలు, స్థానికుల అభ్యంతరాలు నడుమ చివరికి జీహెచ్ఎంసీ తుదిరూపునకు వచ్చింది. జోన్లు, డివిజన్ల పేర్లు మార్చాలని కొందరు చేసిన పోరాటాలు ఫలించాయి. గతంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం వాటిని కొనసాగిస్తు అదనంగా కుత్భుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, శంషాబాద్, గోల్కోండ, రాజేంద్రనగర్ జోన్లుగా నిర్ణయించారు. జీహెచ్ఎంసీ విస్తరిస్తూ నిర్ణయించిన తర్వాత తుక్కుగూడ ప్రాంతవాసులు తమను చార్మినార్ జోన్లో చేర్చవద్దని, ఇలా వివిధ ప్రాంతాలవాసులు ఆందోళనకు దిగారు. అయితే ఆయా ప్రాంతాలవాసులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. తుక్కుగూడవాసులను శంషాబాద్ జోన్ పరిధిలోకి వచ్చారు.
మహ మహానగరం కొత్త జోన్లు, సర్కిళ్లు ఇవే..
జోన్ సర్కిల్ కార్యాలయం
శేరిలింగంపల్లి అమీన్పూర్, అమీన్పూర్ మునిసిపల్ ఆఫీస్
మియాపూర్ చందానగర్ వార్డు కార్యాలయం
నార్సింగి మణికొండ మునిసిపల్ కార్యాలయం
పటాన్చెరు ప్రస్తుత పటాన్చెరు సర్కిల్ ఆఫీస్
శేరిలింగంపల్లి ప్రస్తుత శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయం
కూకట్పల్లి అల్విన్ కాలనీ హైదర్‌నగర్ వార్డు ఆఫీస్
కూకట్పల్లి ప్రస్తుత కూకట్పల్లి సర్కిల్ కార్యాలయం
మాదాపూర్ కూకట్పల్లి జోనల్ ఆఫీస్
మూసాపేట ప్రస్తుత మూసాపేట సర్కిల్ ఆఫీస్
కుత్బుల్లాపూర్ గాజుల రామారం గాజుల రామారం వార్డు కార్యాలయం
చింతల్ చింతల్ వార్డు కార్యాలయం
మేడ్చల్ ప్రస్తుత మేడ్చల్ మునిసిపల్ ఆఫీస్
కొంపల్లి ప్రస్తుత కొంపల్లి మునిసిపల్ ఆఫీస్
జీడిమెట్ల కుత్బుల్లాపూర్ మునిసిపల్ ఆఫీస్
నిజాంపేట ప్రస్తుత నిజాంపేట మునిసిపల్ ఆఫీస్
దుండిగల్ ప్రస్తుత దుండిగల్ మునిసిపల్ ఆఫీస్
చార్మినార్ చార్మినార్ ప్రస్తుత చార్మినార్ సర్కిల్ ఆఫీస్
మలక్‌పేట ప్రస్తుత మలక్‌పేట సర్కిల్ ఆఫీస్
మూసారంబాగ్ కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్
సంతోష్ నగర్ ప్రస్తుత సంతోష్‌నగర్ సర్కిల్ ఆఫీస్
యాకుత్‌పుర చార్మినార్ జోనల్ ఆఫీస్
మల్కాజిగిరి అల్వాల్ ప్రస్తుత అల్వాల్ సర్కిల్ ఆఫీస్
బోయిన్పల్లి సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్
జవహర్‌నగర్ ప్రస్తుత జవహర్‌నగర్ మునిసిపల్ ఆఫీస్
మల్కాజిగిరి ప్రస్తుత మల్కాజిగిరి సర్కిల్ ఆఫీస్
మౌలాలి మౌలాలి మోడల్ మార్కెట్
ఉప్పల్ బోడుప్పల్ ప్రస్తుత బోడుప్పల్ మునిసిపల్ ఆఫీస్
ఘట్కేసర్ ప్రస్తుత ఘట్కేసర్ మునిసిపల్ ఆఫీస్
కాప్రా ప్రస్తుత కాప్రా సర్కిల్ ఆఫీస్
నాచారం కాప్రా సర్కిల్ ఆఫీస్
ఉప్పల్ ప్రస్తుత ఉప్పల్ సర్కిల్ ఆఫీస్
ఎల్బీనగర్ హయత్‌నగర్ ప్రస్తుత సర్కిల్ఆఫీస్-హయత్‌నగర్
ఎల్బీనగర్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్- ఎల్బీనగర్
నాగోల్ వార్డు ఆఫీస్, నాగోల్
సరూర్‌నగర్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్ సరూర్‌నగర్
శంషాబాద్ ఆదిభట్ల ప్రస్తుత సర్కిల్ ఆఫీస్ ఆదిభట్ల
బడంగ్ పేట్ ప్రస్తుత మున్సిపల్ ఆఫీస్, బడంగ్పేట్
జల్పల్లి ప్రస్తుత మున్సిపల్ ఆఫీస్, జల్పల్లి
శంషాబాద్ ప్రస్తుత మున్సిపల్ ఆఫీస్, శంషాబాద్
సికింద్రాబాద్ అంబర్‌పేట ప్రస్తుత సర్కిల్ ఆఫీస్, అంబర్‌పేట
కవాడిగూడ బుద్ధవనం
మెట్టుగూడ జోనల్ ఆఫీస్, సికింద్రాబాద్
ముషీరాబాద్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్, ముషీరాబాద్
తార్నాక హుడా కాంప్లెక్స్, తార్నాక
గోల్కొండ గోల్కొండ వార్డు ఆఫీస్, గోల్కొండ
కార్వాన్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్, కార్వాన్
గోషామహాల్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్. గోషామహాల్
మాసబ్‌ట్యాంక్ ప్రస్తుత సర్కిల్ ఆఫీస్, మెహిదీపట్నం
మెహిదీపట్నం గుడిమల్కాపూర్, వార్డు ఆఫీస్
ఖైరతాబాద్ అమీర్‌పేట అమీర్‌పేట వార్డు ఆఫీస్
బోరబండ, బోరబండ వార్డు ఆఫీస్
జూబ్లీహిల్స్, ప్రస్తుత సర్కిల్ కార్యాలయం జూబ్లీహిల్స్
ఖైరతాబాద్ ప్రస్తుత సర్కిల్ కార్యాలయం ఖైరతాబాద్
రాజేంద్రనగర్ అత్తాపూర్ పాత గ్రామ పంచాయతీ ఆఫీస్
చాంద్రాయణగుట్ట చంద్రాయణగుట్ట సర్కిల్ ఆఫీస్
ఫలక్‌నుమా ఫలక్‌నుమా సర్కిల్ ఆఫీస్
జంగంమెట్ జంగంమెట్ వార్డు ఆఫీస్
రాజేంద్రనగర్ ప్రస్తుత రాజేంద్రనగర్ సర్కిల్ ఆఫీస్
బహదుర్‌పుర చందులాల్ బరాదరి వార్డు ఆఫీస్
………………………………………………………………….

