* 4 ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ
* నీటి ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యూహాలపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ మాజీ మంత్రులతో గులాబీ బాస్ కేసీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలతో జరగనున్న ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు కూడా పాల్గొననున్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చించనున్నారు. నీటి ప్రాజెక్టుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పాటించాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభల ఏర్పాటుకు ప్రణాళికలు రచించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా తీవ్రంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన బీఆర్ ఎస్ కార్యనిర్వాహక సమావేశం అనంతరం మీడియా సమావేశంలో సర్కారు నిర్ణయాలను ఎండగట్టిన కేసీఆర్ బీజేపీకి కూడా చురకలు అంటించారు. కొద్ది రోజుల్లో నేతలతో సమావేశం కానుండడంతో బీఆర్ ఎస్ శ్రేణులతో ఉత్సాహం రెట్టింపవుతోంది. గులాబీ బాస్ మళ్లీ యాక్టీవ్ అయితే పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………..

