* శాసనసభకు హాజరైన గులాబీ బాస్
* సమావేశాలు ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. తొలుత చనిపోయిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలిపింది. అనంతర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) సమావేశాలను ప్రారంభించారు. ఉత్కంఠకు తెర దించుతూ మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ (KCR) శాసనసభకు హాజరయ్యారు. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) కరచాలనం చేశారు. ఆయనను పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు కూడా కేసీఆర్ కు అభివాదం చేశారు. అయితే.. జాతీయ గీతం అవ్వగానే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. నందినగర్ నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కేసీఆర్ రావడం.. వెంటనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
……………………………………………..

