* మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం వాయిదా పడిరది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తన ఛాంబర్లో మంత్రులు, విప్‌లతో దాదాపు గంట పాటు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నీటివాటల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్‌గా ఉండాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని.. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలన్నారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం అని తెలిపారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలన్నారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు.
……………………………………

