* 2025 సంవత్సరం నాకు ఏమాత్రం కలిసి రాలేదు
* కల్వకుంట్ల కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: 2025 సంవత్సరం పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు, రాజకీయ సవాళ్లను తాను ఎదుర్కొన్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. 2025 తనకు ఏమాత్రం కలిసి రాలేదన్నారు. ఎంత ప్రయత్నించినా చివరికి తనపై కుట్రలు చేసినవాళ్లే గెలిచారని, అందుకే వారు ఇప్పటికీ పార్టీలో పదవులతో కొనసాగుతుండగా తాను మాత్రం బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదని, బీఆర్ఎస్లోని ఒక వర్గం 2019 నుంచే తనకు వ్యతిరేకంగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రజల కోసం, ఉద్యమం కోసం మాత్రమే పనిచేశానని కవిత తెలిపారు. తనను ఓడిరచేందుకు ఎంతమంది కలిసి పనిచేసినా, తాను మాత్రం ధైర్యంగా నిలబడతానని, ఎవరినీ భయపడబోనని అన్నారు.
…………………………………….

