ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరాఖండ్లో ఓ బస్సు లోయలో పడడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. అల్మోరా జిల్లా భికియాన్ సైన్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మధ్యాహ్నమే ఈ ప్రమాదం జరిగిన ఘటనాస్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అల్మోరా జిల్లాలోని కొండ ప్రాంత మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మలుపు వద్ద బస్సు అదుపు తప్పి వందల అడుగుల లోతు ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే బస్సులు ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియలేదు. లోయలో పడిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది కష్టపడుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………..

