* 5వ శతాబ్దపు సాంకేతికతతో తయారైన కౌండిన్య నౌక
* భారత స్వదేశీ సముద్రయాన మేధస్సుకు పునరుజ్జీవన నివాళిగా కౌండిన్య నౌక రూపకల్పన
ఆకేరు న్యూస్, కమలాపూర్ : అత్యాధునికమైన భారత నావికాదళంలోకి అత్యంత పురాతన INSV కౌండిన్య నౌక చేరింది. ఈ నౌక పురాతన సముద్ర సాంకేతికతతో కేవలం కొబ్బరి దారాలతో, సహజ సిద్ధ రేసిన్ తో రూపొందించబడింది. మొదటి భారతీయ నావికుడైన కౌండిన్యకు నివాళిని ఇస్తూ, పురాతన సముద్ర వారసత్వాన్ని కొనసాగిస్తూ తాడు, తెరచాపలు జ్ఞాపకాలతో కుట్టిన సజీవ కథ INSV కౌండిన్య. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ నౌకలు మౌర్యుల, చోళుల కాలంలో ఆఫ్రికా, అరేబియా , ఆగ్నేయ ఆసియా వరకు ప్రయాణించేవి. ఈ నౌక నిన్న గుజరాత్ లోని పోర్బందర్ నుండి ఒమన్ దేశంలోని మస్కట్‌కు బయలుదేరింది. INSV కౌండిన్య తన తొలి ప్రయాణంలో 16 మంది సిబ్బందితో 15 రోజులు ప్రయాణించి 1400 కిలోమీటర్ల దూరంలోని మస్కట్‌కు చేరుకొనుంది.
భారత నావికాదళం, కళాకారులకు అభినందనలు
– ప్రధాని మోడీ
పురాతన భారతీయ కుట్టిన-ఓడ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడిన ఈ నౌక భారతదేశ గొప్ప సముద్ర సంప్రదాయాలను హైలైట్ చేస్తుంది. ఈ ప్రత్యేకమైన నౌక కు జీవం పోయడంలో అంకితభావంతో కృషి చేసిన డిజైనర్లు, కళాకారులు, నౌకానిర్మాణదారులు, భారత నావికాదళాన్ని అభినందిస్తున్నాను. గల్ఫ్ ప్రాంతంతో, అంతకు మించి మన చారిత్రక సంబంధాలను తిరిగి పొందుతున్నందున, సిబ్బంది చిరస్మరణీయమైన ప్రయాణానికి నా శుభాకాంక్షలు. అని ప్రధాని మోడీ సామాజిక వేదికలో తెలిపారు.

………………………………………..

