* ఉద్యమకారులతో కలిసి నిరసనలు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే జనం బాట పేరుతో తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆమె ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, మహిళా సాధికారత వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పుడు ఉద్యమకారులతో కలిసి కరీంనగర్ వేదికగా భూపోరాటానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వకపోవడానికి నిరసనగా పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. పోరాటంలో భాగంగా ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయనున్నారు. డిసెంబర్ 9లోగా ప్రభుత్వం హామీ నెరవేర్చకపోతే భూపోరాటం చేస్తామని గతంలోనే హెచ్చరించారు, అలాగే, తెలంగాణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అధికారంలో ఉన్న సమయంలో న్యాయం చేయలేకపోయామని క్షమాపణలు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, డిసెంబర్ 9, 2025లోగా హామీ నెరవేర్చకపోతే భూపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం హామీ నెరవేర్చకపోవడంతో ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నారు.
…………………………………………….

