* భక్తుల సౌకర్యమే మా మొదటి ప్రాముఖ్యత
* ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
* ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సౌకర్యవంతమైన పార్కింగ్ ఏర్పాట్లను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ , డీఎఫ్ఓ కిషన్ జాదవ్ లతో కలిసి గట్టమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని జాతర సమయంలో వేల సంఖ్యలో వచ్చే ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించేందుకు, సుమారు 10 ఎకరాల మేర ప్రాంతాన్ని అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ సారి ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతికులంగా మారనుంది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పార్కింగ్ ప్రాంతంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పష్టమైన రేడియం స్టిక్కర్లు, దిశానిర్దేశక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్ పి ఆదేశించారు. వాహనాలు సులభంగా వచ్చేందుకు అవసరమైన ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
పార్కింగ్ నుంచి ఆలయ మార్గం వరకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల సాఫీగా రాకపోకలు జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించారు. మేడారం జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట అటవీశాఖ పోలీస్ శాఖ అధికారులు తదితరులున్నారు.
…………………………………………..

