ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రామంతాపూర్, బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ల పరిధిలోని రెండు హాస్టళ్లలో గిరిజన విద్యార్థులకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు (ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో) ట్యూషన్లు చెప్పేందుకు ఒక పురుషుడు, ఒక మహిళ ట్యూటర్ కావాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో ఏదైనా డిగ్రీ, బీఈడీ చదివి ఉండాలని, ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్: 9121592057 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి కోటాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
……………………………………………….

