* అర్ధరాత్రి నుంచి 9వ తేదీ వరకు..
* 2,108 అడుగుల ఎత్తులో గుట్టపై కొలువైన హజ్రత్ఆలీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరానికి 11 మైళ్ల దూరంలో ఉత్తర దిశలో 2108 అడుగుల ఎత్తులో గుట్టపై కొలువై ఉన్నారు హజ్రత్ అలీ. అలీ దర్శనానికి దేశ, విదేశాల నుంచి కూడా తరలి వస్తుంటారు. ప్రధానంగా సౌది అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ తదితర దేశాల నుంచి భక్తులు విచ్చేసి దర్శనం చేసుకుంటారని స్థానికులు చెబుతున్నారు.
దేశ, విదేశాల నుంచి..
కొండపైన హజ్రత్ ఆలీ (పంచాబాబా)ని దర్శించుకుంటే కోరిన కోర్కేలు తీరుతాయని భక్తుల నమ్మకం. హజ్రత్ ఆలీ జయంతిని పురస్కరించుకొని 2వ తేది అర్థరాత్రి నుంచి 9వ తేది వరకు ఉర్సు ఉత్సవాలు జరుతుండడంతో మున్సిపల్ అధికారులు దర్గా పరిసర ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రతతోపాటు లైటింగ్, సుందరికరణ, తాగునీటి సదుపాయం వంటి పనులు చురుకుగా సాగుతున్నాయి.
మౌలాలిలోని గుట్టపై..
ఇస్లాం దూత హజ్రత్ మేనల్లుడు హజ్రత్ అహ్మద్ ముస్తాఫా సంస్మరణార్థం దర్గాను 1578లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇబ్రహీం కులీకుతుబ్ షాహీ నవాబ్ కలల సౌధంగా పెద్దలు చెబుతుంటారు. దీనినే కోహీ – ఈ – మౌలాలి అనికూడా పిలుస్తుంటారు. మౌలాలిలోని గుట్టపై గల దర్గాను కింద ఉన్న చిల్లాను మెదటి దర్శిఇంచుకున్న తర్వాతనే భక్తులు దర్గాను సందర్శించుకుంటారు. చిల్లా నుంచి గుట్టపై గల దర్గా వరకు సుమారు 510 మెట్లు ఎక్కి హజ్రత్ ఆలీని దర్శించుకుంటారు.
………………………………………………………….

