ఆకేరు న్యూస్, ములుగు: మార్గ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 28 నుంచి 31 వరకు జరుగు మేడారం మహా జాతరలో అమ్మవార్ల గద్దెలపై ముందస్తుగా పూజారులు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హుండీలను సీలు వేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతర ముందు ఉన్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి కాక పోరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తు అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని ఆశీస్సులు పొంది ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే భక్తుల సౌకర్యర్థం సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు పగిడిద్దరాజుల గద్దెలపై ప్రస్తుతం 60 హుండీలకు,సీళ్ళు వేసి పెద్దలపై ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వీరస్వామి, పూజారులసంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు అనిల్ కుమార్, కాక వెంకటేశ్వర్లు, నితిన్, స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు, దేవాలయ పరిశీలకులు, పోలీసు, దేవాదాయ శాఖ, పూజారులు, స్థానిక అధికారులు తదితరులున్నారు.

…………………………………………………

