ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసి ఆరాధ్య దైవాలు వెలసిన మేడారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు ,గోవిందరాజుల గద్దెలను శని వారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతమ్ కుటుంబ సభ్యులతో దర్శించుకుని ఆదివాసి ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం దేవేరుల గద్దెలపై పసుపు కుంకుమ బంగారం (బెల్లం)చెల్లించి ఆశీర్వాదం పొందారు. మొదట దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి అమ్మవార్ల గద్దెల పై పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవార్ల పసుపు కుంకుమలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుల రవి, మేడారం జాతర కార్యనిర్వాహణాధికారి వీరస్వామి తో పాటు పూజారులు స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

………………………………………………………..

