* ప్రాధాన్యతాపరంగా సమస్యల పరిష్కారం
* కలెక్టర్ హరిచందన దాసరి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజావాణి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ప్రాధాన్యతాపరంగా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గృహనిర్మాణశాఖకు 221, రెవెన్యూకు 73, ఇతర విభాగాలకు 23 ఆర్జీలు అందాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పరిష్కరించిన ఆర్జీలను వెంటనే ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు వాట్సాప్ ద్వారా అందించే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2026 వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్ పలని, జితేందర్‌రెడ్డి, డీఆర్ఓ వెంకటాచారి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, ఆర్డీఓలు సాయిరాం, రామ కృష్ణ, సీపీఓ సురేందర్, డీఎంహెచ్ఓ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ర్టేట్ జ్యోతి, లా ఆఫీసర్ శ్రీధర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కోటాజీ, ఆశన్న, ఇలియస్ అహ్మద్ పాల్గొన్నారు.

