* పూరించనున్న మునిసిపల్ ఎన్నికల శంఖారావం
* టీపీసీసీ, పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 9 ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) బహిరంగ సభల నిర్వహణకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో నిర్వహించే సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. 3వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ తొలి బహిరంగ సభ జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సభలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురువారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ (MINISTER PONGULETI SRINIVAS) కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో జరిగే తొలి బహిరంగ సభ నుంచే సీఎం రేవంత్ మునిసిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నికలు, పంచాయితీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మునిసిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
…………………………………………………

