* విలువ రూ.1.29 కోట్లు
* అమ్మినా.. కొన్నా నేరమే : హైదరాబాద్ సీపీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చైనా మాంజా ఎవరూ అమ్మడానికి లేదని, ఎవరైనా అమ్మితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (HYDERABAD CP SAJJANAR) హెచ్చరించారు. నగరంలో నిషేధిత మాంజాను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుఉండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై నిషేధం ఉన్నా కొందరు విక్రయాలు సాగిస్తున్నారు. ఈ మాంజా తెగి గాల్లో వేల్లాడుతున్న సమయంలో వాహనదారుల మెడకు చుట్టుకుంటోంది. దీని వల్ల కొందరు గాయాలపాలవుతున్నారు. దీంతో ప్రాణాంతకమైన చైనా మాంజాపై కేంద్రం నిషేధం విధించిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. ఈ మాంజా కొన్నా నేరమేనని నగర ప్రజలకు సూచించారు.
…………………………………………………

