* మెట్పల్లి పట్టణంలో ఘటన
* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
ఆకేరు న్యూస్, జగిత్యాల : ప్రమాదకరమైన చైనా మాంజాను గాలిపటాల ఎగరవేతకు వాడొద్దని ఓ వైపు ప్రభుత్వం పోలీసులు హెచ్చరిస్తున్నా యథేచ్ఛగా చైనా మాజా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రమాదకమైన సీసం లోహాల చూర్ణాలతో చైనా మాజాను తయారు చేస్తారు. చైనా మాజా శరీరానికి తాకితే తీవ్రంగా గాటు పడి తీవ్ర రక్త ప్రసావం కూడా సంభవిస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి తాజాగా తాజాగా మెట్పల్లిలో చైనా మాంజా వల్ల గొంతు కోసుకుని నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.. మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ ప్రాంతానికి చెందిన శ్రీహాస్ (4) అనే బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చైనా మాంజా ఒక్కసారిగా గొంతుకు చుట్టుకుంది. మాంజాను తీయబోతుండగా గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గొంతు భాగంలో తీవ్రమైన గాయమవడంతో చిన్నారి గట్టిగా కేకలు వేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న బాలుడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

