* ఆల్మంట్- కిడ్ సిరప్ ల నిషేదం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : పిల్లలకు అలర్జీ, జ్వరం, ఆస్తమా వంటి సమస్యలకు వినియోగించే సిరప్‌ను వెంటనే నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆల్మంట్ కిడ్ సిరప్ లను
నిషేదిస్తూ తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.ఎవరైనా ఈ సిరప్ నియోగిస్తుంటే తక్షణమే నిలిపేయాలని టీజీసీఏ సూచనలు చేసింది. అలాగే సిరప్ వినియోగ సమాచారాన్ని సమీప డ్రగ్ కంట్రోల్ అధికారికి ఇవ్వాలని సూచించింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కిడ్నీ సమస్యలు, న్యూరాలజికల్ డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL 24002 బ్యాచ్ సిరప్‌ల్లో కల్తీ జరిగిందని పశ్చిమ బెంగాల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేషన్ నుంచి హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే.. వాడకం ఆపేయాలని.. అలాగే మార్కెట్లోనూ విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం ఆదేశించారు.
…………………………………………………

