* సీపీ సజ్జనార్ మరోసారి హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రమాదకరంగా మారిన చైనా మాంజాపై ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad Police Commissioner Sajjanar) మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. వాటిని అమ్మినా, కొనినా కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. చైనీస్ మాంజా యాడ అమ్మినా ఊకోకండి.. పోలీసులకు పక్కా సమాచారం ఇయ్యండి. మీరు కొనకండి, పక్కోళ్లను కొననియ్యకండి. చైనీస్ మాంజా (Chainees Manja) దారం కాదు, అది మనుషుల పాలిట యమపాశం.. పక్షుల గొంతు కోసే రక్కసి. ప్రభుత్వం నిషేధించిన ఆ మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవ్!.. అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై సజ్జనార్ ప్రచారం చేస్తున్నారు. విక్రతలపై దాడులు చేస్తూ భారీ స్థాయిలో మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విక్రయాలకు అడ్డపడ లేదు. నిన్న చైనా మాంజా వల్ల గొంతు కోసుకుని అంబర్పేటలో మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈనేపథ్యంలో సజ్జనార్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
…………………………………………………….

