* మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ
ఆకేరు న్యూస్ , వరంగల్ : పసిపిల్లలను ఎత్తికెళ్లి అమ్ముకుంటున్న దుండగులను పోలీసులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. గత నెల 28 వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల బాలుడిని ఎత్తికెళ్ల బాధితుడు కన్నా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు
ఎట్టకేలకు పసిపిల్లలను ఎత్తికెళ్లి అమ్ముకుంటున్న మఠాను అరెస్ట్ చేశారు. మళ్లీ ఈ రోజు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉండగా పోలీసులు చాకచక్యంగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
నేరస్థుల వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొడుపాక నరేష్ తండ్రి(42 ) , వెల్పుల యాదగిరి, (32 )లు ఇద్దరు కలిసి గత కొంతకాలంగా పసిపిల్లలను దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వివరించారు.ఇద్దరు కలిసి ఓ స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.ఇద్దరినీ విచారించగా ఇద్దరు కలిసి గతంలో ఎంతమంది పిల్లలను ఎత్తుకెళ్లింది వెలుగులోకి వచ్చినట్లు సీపీ తెలిపారు. డిసెంబర్ 28న ఎత్తికెళ్లిన 5 నెలల బాబును జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో సంతానం లేని దంపతులకు అమ్మినట్లు సీపీ వివరించారు. అదే విధంగా 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై
తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో అమ్మినట్లు తెలిపారు, 2023 అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంలో తల్లిదండ్రలతో కలిసి నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ నెలలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిదురిస్తున్నటు 05 నెలల పాపను మంచిర్యాలలో అమ్మినట్లు సీపీ వివరించారు. 2025 జూన్ నెలలో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినట్లు సీపీ మీడియాకు వివరించారు.చిన్నపిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకనబరిచిన టాస్క్‌ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

……………………………………………………..

