* ఆటపాటలు, ముగ్గుల పోటీల్లో సందడి చేసిన విద్యార్థులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ బాచుపల్లి క్యాంపస్ లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. తొలుత వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. పలు రకాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ విద్యార్థి సాయికిరణ్, ఎంఏ భాషా శాస్త్రం విద్యార్థి ముస్తాఖ్, ఎంఏసీజే ప్రథమ సంవత్సరం విద్యార్థిని, విన్నం ఒక పోరాటం ఎన్జీవో చీకూరి లీలావతి నిర్వహణలో ముగ్గులు, నృత్యం, ఆటపాటల పోటీలు నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. రంగవల్లులు వేస్తూ, పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు. ముగ్గుల పోటీలో జర్నలిజం ప్రథమ సంవత్సర విద్యార్థిని నదియా, బీఎఫ్ఏ విద్యార్థిని రెడ్డమ్మ, తిమ్మప్ప ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. డీన్, హెచ్ ఓడీ పద్మప్రియ విజేతలకు బహుమతులు అందజేశారు.

………………………………………………..

