* చట్ట ప్రకారం వెళ్తాం.. వదిలే ప్రసక్తే లేదు..
* మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధనకు కార్యాచరణ రూపొందించినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన ఆత్మగౌరవం, అస్తిత్వంపై దెబ్బకొడితే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరినీ సంప్రదించకుండానే పునర్విభజన చేశారని, చట్ట ప్రకారం వెళ్తాం.. వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ ఆస్పత్రి వరకు శాంతియాత్ర చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే రైల్వేస్టేషన్, జేబీఎన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ బంద్, ఆమరణ దీక్ష కూడా చేపడతామని అన్నారు.
………………………………………..

