* సంక్రాంతికి ఈవెంట్ల సందడి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే వారితో రోడ్లుగా బిజీగా ఉంటున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లను కిక్కిరిసిపోతున్నాయి. నగరంలో ఉంటున్న చాలా కుటుంబాలు ఊళ్లకు ఇప్పటికీ సిద్ధమవుతున్నారు. కార్లు, బస్సులు, రైళ్లు ఎలా కుదిరితే అలా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. చాలామందికి ఇప్పటికే బయలుదేరగా.., మరికొందరు వెళ్లేందుకు మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు అదనపు సిటీ బస్సులను, ప్రత్యేక రైళ్లను నడిపినా, పూర్తి స్థాయిలో ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇదిలాఉంటే భారీగా పెరిగిన బస్ చార్జీలతో ఆర్థికస్థోమత లేక, సెలవులు దొరకక, ఊరికి వెళ్లలేకపోయారా?.. ఏం పర్వాలేదు.. హైదరాబాద్‌లోనే పండుగ చేద్దాం.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి 18 వరకు నగరంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి.
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి వస్తోందంటే.. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏటా నగరంలో ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి 2026 సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ గాలిపటం – స్వీట్స్ ఫెస్టివల్ (జనవరి 13-15), హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ (జనవరి 16-18), గాచిబౌలి స్టేడియంలో డ్రోన్ షో (జనవరి 16-17) వంటి భారీ ఈవెంట్లతో ఆకాశం రంగులతో నిండిపోతోంది. దీనితో పాటు, ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లడం కోసం బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది, సంప్రదాయక వేడుకలు, పిండివంటలు, అల్లుళ్ళ పర్యటనలతో పండగ సంబరాలు జోరుగా ఉన్నాయి.
19 దేశాల నుంచి..
ఏటా కైట్ ఫెస్టివల్ నగరానికి విచ్చేస్తుంది. ఇక్కడ గాలిపటాలు ఎగురవేసేందుకు 19 దేశాల నుంచి క్లైట్ ఫ్లయర్స్ వస్తుంటారు. విభిన్న రకాల పతంగులతో పోటాపోటీగా ఎగురవేస్తుంటారు. దీనికి తోడు వందకు పైగా ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు. ఫుడ్ స్టాల్స్, అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ – నైట్ కైట్ ఫ్లయింగ్ నెక్లెస్ రోడ్డు వేదికగా ఉంటాయి.
ఈసారి సరికొత్తగా..
ఈసారి సంక్రాంతికి పరేడ్ గ్రౌండ్స్ లో మరో అత్యద్భుత ఈవెంట్ సిద్ధం అవుతోంది. ఈ నెల 16 నుంచి 18వతేదీల్లో యూరప్ నుండి వచ్చిన హాట్ ఎయిర్ బెలూన్లతో మార్నింగ్ ఫ్లైట్స్, నైట్ గ్లో షోలు జరుగుతాయి. ఈ షోలు నగరవాసులకు విభిన్న అనుభూతులను అందించనున్నాయి.
డ్రోన్ రేసింగ్
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈసారి డ్రోన్ లు విహరించనున్నాయి. గచిబౌలి స్టేడియం ఈ నెల 16 17 తేదీల్లో రంగుల డ్రోన్ లైట్ షోలు అలరించనున్నాయి. అంతేకాదు.. FPV డ్రోన్ రేసింగ్ ఉంటాయి. ఇవేకాకుండా షాద్‌నగర్‌లోని అక్షయ CSA వంటి ప్రదేశాల్లో రంగోలి, కోడి పందేలు (కొన్ని ప్రాంతాల్లో), హరిదాసుల ప్రదర్శనలు ఉండనున్నాయి.
………………………………………………….

