* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తాను ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) తెలిపారు. తీసుకుందామని అనుకున్నా ఏదో ఒక పని వచ్చి పడుతుందని చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో మాట్లాడారు. 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే ఈ రాష్ట్రాన్ని నడపలేరని తెలిపారు. ప్రభుత్వ సారథులు.. వారధులు ప్రభుత్వ ఉద్యోగులే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు.
……………………………………..

