* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఓ వైపు చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినా అడ్డదారుల్లో చైనా మాంజా అమ్మకాలు కొనసాగుతున్నాయి. చైనా మాంజాతో ప్రమాదం అని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. అయినా పతంగి ప్రియులు ఇవేమీ పట్టించుకోకుండా చైనా మాంజాను ఉపయోగిస్తున్నారు. చైనా మాంజా మెడకు చుఏట్టుకొని ఓ ఏ ఎస్ ఎస్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో గాయాలపాలయ్యాడు. ఉప్పల్ నుంచి ఆఫీస్కు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వేలాడుతున్న చైనా మాంజా నాగరాజు మెడకు చుట్టుకోవడంతో మెడ కోసుకుపోయి రక్త స్రావం జరిగింది. వెంటనే స్థానికులు నాగరాజును కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా చైనా మాంజాతో గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి గాయపడిన విషయం తెల్సిందే.. ఇంకా వెలుగుచూడని సంఘటనలు అనేకం ఉన్నాయి.
……………………………………………………….

