– శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎన్నిక
ఆకేరు న్యూస్, కమలాపూర్ : మండలంలో ప్రసిద్ధి పొందిన ఉప్పల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ గోదారంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. పురోహితులు శ్రీరంగం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మణాచార్యులు, హరీషాచార్యులు , శ్రీనివాసచార్యులు ఉదయం స్వామివారికి తిరువంజనం, అలంకరణ చేశారు. శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువు తీర్చి, గోదారంగనాథస్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు వేకువ జామున ధనుర్మాసం పూజలు, తిరుప్పావై ప్రవచనాలు చెప్పారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కళ్యాణ అనంతరం పురోహితులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎన్నిక
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడుగా మహారాజు స్వామి, ఉపాధ్యక్షుడిగా ఎలిగేటి రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా నాయినేని శ్రీనివాసరావు, ఉప కార్యదర్శిగా ర్యాకం గట్టయ్య, కోశాధికారిగా చెట్టి సుందరయ్య, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆలయ కమిటీ 2 ఏళ్లపాటు ఆలయ అభివృద్ధి కోసం పాటుపడనుంది. కాగా ఆలయ కమిటీ ఎన్నిక 8 సంవత్సరాల తర్వాత జరగటం తో నూతన కమిటీ ఎన్నిక ఆసక్తిని రేకెత్తించింది.

……………………………………………………

