ఆకేరున్యూస్, మేడారం: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క-సారలమ్మ ఆలయానికి చేరుకొని నూతనంగా నిర్మించిన పైలాన్‌ను మంత్రులతో కలిసి ప్రారంభించారు. అభివృద్ధి పనులు పూర్తి కాగానే సీఎం కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఎత్తుబెల్లం సమర్పించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్‌లో బయలుదేరి వెళ్లారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
……………………………………
