* ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం
* 15 నియోజకవర్గాలకు 15 మంది మంత్రులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వారీగా ఆయా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకు గానూ 15 మంది మంత్రులు ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సంబంధిత రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆదిలాబాద్‌కు మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలో నిజామాబాద్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మల్కాజిగిరి -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెళ్ల – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్- తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం-కొండా సురేఖ, మహబూబాబాద్ – పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్ – దామోదర రాజనరసింహ, జహీరాబాద్ – అజారుద్దీన్ మెదక్ – వివేక్ వెంకటస్వామి, నాగర్‌కర్నూల్ -వాకిటి శ్రీహరి, నల్గొండ – అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ , భువనగిరి – సీతక్క, వరంగల్ -పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి -జూపల్లి కష్ణారావులను నియమిచారు. తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా వీరు కషి చేయాల్సి ఉంటుంది.

………………………….
