* ప్రజాప్రభుత్వంలో మహిళలకు అపారమైన గౌరవం
* ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సును నడిపిస్తాం
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరున్యూస్, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు, మహిళా సంఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ, రేగొండ మండల కేంద్రంలో 3 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న బస్సు షెల్టర్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సంకేర్త్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు వచ్చేస్తున్నాయని ప్రజల రక్షణకు 3 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మహిళలు పట్ల అపారమైన గౌరవం ఉందని తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. నిధులు, నీళ్లు, నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని, ఉద్యోగాలు రాలేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేయకట్టగానే గ్రూప్ 1,2 3 వన్ ఉద్యోగాలతో శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 డిపోలు 341 బస్టాండ్లు ఉన్నాయని రోజుకు 10 వేల బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారన్నారు. ప్రతి రోజు 35 లక్షల కిమి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రతి గ్రామానికి బస్సులు తిరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 బస్సులు, 3 వేల మందికి పైగా సిబ్బంది ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్లతో బస్టాండ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2012 తదుపరి ఒక్క ఆర్టీసీ బస్సు కొనుగోలు చేయలేదని తాము అధికారం చేపట్టిన తర్వాత నూతన బస్సులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటవ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సంస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ మనందరి సంస్థఅని దీనికి ఓనర్లు ఎవరూ ఉండరని ప్రజలే ఓనర్లు అని ఆయన స్పష్టం చేశారు.
అడవి జంతువుల నుంచి రక్షణగా గోడ నిర్మాణం : ఎమ్మెల్యే సత్యనారాయణరావు
చుట్టూ అడవి ఉండటం అడవి జంతువులు కాలనీలోనికి ప్రవేసించి ప్రజలను బయ బ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో రక్షణ గోడ నిర్మాణం వల్ల అడవి జంతువుల నుండి రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. లక్ష జనాభా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులలో సిసి రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణం, అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు అభివృద్ధి సహకరించాలని ఆయన సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో నీటి కొరత, కుక్కలు, కోతులు బెడద లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి డిపోకు 20 నూతన బస్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. తన హయాంలో అభివృద్ధి చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగనని ఆయన స్పష్టం చేశారు. రేగొండ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు సెంటర్ ఏర్పాటు చేయటం ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపారు. బస్ షెల్టర్ నిర్మాణం వల్ల చిట్యాల, మొగల్లపల్లి, గోరికొత్తపల్లి, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నుంచి బస్టాండ్ కావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ నెరవేర్లేదని తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్లు తెలిపారు. ఈ బస్టాండ్ లో బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడిఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
