ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు సంబంధించింది పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో నెం.87ను విడుదల చేశారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారు, ఒకేచోట సుదీర్ఘ కాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనా కారణాలతో పాటు పదోన్నతులపై మొత్తం 47 మందిని బదిలీ చేశారు.
………………………………………
