హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
ఆకేరు న్యూస్ ,డెస్క్:ట్రాఫిక్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పదే పదే తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తప్పదు. ఒక ఏడాది కాలంలో ఎవరైనా డ్రైవర్ 5 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే, వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు లేదా కనీసం 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు.గతంలో కేవలం తీవ్రమైన ప్రమాదాలకే ఈ నిబంధన ఉండేది. హెల్మెట్ ధరించకపోవడం,సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం,సిగ్నల్ జంపింగ్,అతివేగంగా వాహనం నడపడం. కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సవరణను తీసుకువచ్చింది. ఇది జనవరి 1 నుండి అమలులోకి తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం కోసం ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
