ఆకేరు న్యూస్, వరంగల్ : గత ఏడాది అక్టోబర్ నెలలో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ఖిలా వరంగల్ రాతికోట పశ్చిమ ముఖ ద్వారం కూలింది. దీంతో అధికారులు వారసత్వ సంపద అయినటువంటి రాతికోటను పరిరక్షించాలని ఉద్దేశంతో ఏఎస్ఐ ముందుకు వచ్చింది. దీనిని పరిరక్షించాలని ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. గురువారం రోజున మరమ్మత్తుల పనులను ప్రారంభించారు. కూలిన బండరాలను తిరిగి యధా స్థానంలో అమర్చుతున్నారు. మరమ్మత్తు పనుల వల్ల అక్కడున్న స్థానికులకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని బండారాలను వాటి యొక్క పాత స్థానంలోనే అమర్చేందుకు భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. పనులు వేగవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
…………………………………………………………………………….
