ఆకేరు న్యూస్, వరంగల్: బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. టెండర్లు అగ్రిమెంట్లు పూర్తయినా.. అభివృద్ధి పనులలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులను మేయర్ ప్రశ్నించారు. ఇంజనీర్ల పనితీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఆలస్యం చేసిన అభివృద్ధి పనులపై ఆమె ఆరా తీశారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఒకవేళ కాంట్రాక్టర్లు స్పందించకపోతే నోటీసులు ఇచ్చి టెండర్లను రద్దుచేసి వెంటనే రీ కాల్ చేయాలని ఆదేశించారు. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వాహనాల మరమ్మతులు వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవి లత ,డీఈలు కార్తీక్ రెడ్డి, సూపర్వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
………………………………..
