* ఇక షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. నేటి నుండి వాహన విక్రయ కేంద్రాల (డీలర్ల) వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.వాహనం కొన్న వెంటనే, సంబంధిత షోరూమ్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర రవాణా సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందనున్నాయి. అవినీతికి చెక్ పెట్టేందుకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రవాణా శాఖలోని దాదాపు అన్ని సేవలను ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరింది… కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్ వెహికల్ (EV)పాలసీ’ మరియు పాత వాహనాల తొలగింపు కోసం ‘స్క్రాప్ పాలసీ’ని పటిష్టంగా అమలు చేస్తోంది.”ప్రజలకు రవాణా సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు . అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పనులు పూర్తయ్యేలా సంస్కరణలు చేపట్టాం. ప్రజలందరూ ఈ మార్పులను గమనించి సహకరించాలి,” అని మంత్రి పొన్నం కోరారు.
…………………………………………………
