* కక్షతోనే రేవంత్ ప్రభుత్వం కుట్ర
* చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని మాజీ మంత్రి హరీశరావు అన్నారు. తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే అని వెల్లడించారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట ఇది అన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అన్నారు.
“అధికారం శాశ్వతం కాదు…
అహంకారం అంతకంటే కాదు.
తెలంగాణ సమాజమంతా
కేసీఆర్ గారి వెంటే ఉంది.
మీ రాజకీయ వేధింపులకు భయపడే
ప్రసక్తే లేదు.
ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు.ష అని హరీశ్‌రావు ఎక్స్ ఖాతాలో కేసీఆర్ నోటీసులపై స్పందించారు.
