Rajinikanth Dharman Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధర్మన్’ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ రాఘ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది.
* ఇప్పటికే భారీ అంచనాలు
రజినీకాంత్ కొత్త లుక్కు సంబంధించిన వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో షూటింగ్ స్పాట్లో రజినీకాంత్‌తో దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
* యాక్షన్ తో పాటు హాస్యం, సస్పెన్స్
‘ధర్మన్’లో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నేరస్థులను ఎదుర్కొనే పాత్రలో ఆయనను దర్శకుడు సరికొత్త కోణంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు హాస్యం, సస్పెన్స్ అంశాలతో సినిమా సాగనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాఘ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు అన్బరివ్ ద్వయం స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. రజినీకాంత్ కొత్త లుక్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న కథా విధానం కారణంగా ‘ధర్మన్’పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
