ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. అయితే వ్యక్తిగత ఆదాయ పన్ను యథాతథంగా ఉంచడంతో తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఇదే సమయంలో సామాన్యులు, మధ్యతరగతి వర్గం.. మరో అంశంపై దృష్టి సారిస్తుంటుంది. ప్రభుత్వం వేటిపై దిగుమతి సుంకాల్ని తగ్గిస్తుందని చూస్తుంటారు. అంటే దిగుమతి సుంకాల్ని తగ్గిస్తే వాటి ధరలు దిగొస్తాయని చెప్పొచ్చు. అసలు ఏ ధరలు తగ్గుతాయో, పెరుగుతాయో పరిశీలిస్తే..
ధరలు తగ్గేవి
* మైక్రో వేవ్
* సోలార్ ప్యానళ్లు
* క్యాన్సర్ ఔషధాలు
* CNG, బయోగ్యాస్
* తోలు ఉత్పత్తులు
* స్మార్ట్ఫోన్లు
* ఈవీ బ్యాటరీలు
* బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు
17 క్యాన్సర్ ఔషధలపై పన్ను తగ్గింపు
కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గించింది. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీకి మినహాయింపు ఇచ్చింది. అలాగే మైక్రో అవెన్స్పై పన్ను తగ్గింపు, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ధరలు పెరిగేవి
* విదేశాల్లో తయారయ్యే లగ్జరీ వాచీలు, చెప్పులు, దుస్తులు.
* ప్రీమియం ఆటోమొబైల్స్ ధరలు
* విదేశీ మద్యం ఆల్కహాల్
* పొగాకు ఉత్పత్తులు
* సిగరెట్, పాన్ మసాలా
…………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
