*ధనవంతుల కంటే సామాన్యుల దాతృత్వమే అధికం
* సామాన్య ప్రజలే ఏటా ₹54,000 కోట్ల దానం!!
* 42% దానాలు బిచ్చగాళ్ళకే
* CSIP విడుదల చేసిన హౌ ఇండియా గివ్స్ 2025-26 రిపోర్ట్‌లో వెల్లడి
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
మనకు తెలిసి పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే భారీ ఎత్తున విరాళాలు చెల్లిస్తాయి. వారు ఇచ్చే విరాళాలు మాత్రమే అందరికీ తెలుస్తాయి. ఢిల్లీలోనీ అశోక యూనివర్సిటీ సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రపీ (CSIP) హౌ ఇండియా గివ్స్ 2025-26 రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, దేశంలో సాధారణ కుటుంబాల ద్వారా ఏటా సుమారు రూ.₹54,000 కోట్ల దానధర్మాలు జరుగుతున్నాయి. ఇది $6 బిలియన్ డాలర్లకు సమానం. 68% మంది భారతీయులు నగదు, వస్తువులు లేదా స్వచ్ఛంద సేవ ఇలా ఏదో ఒక రూపంలో దానం చేస్తున్నారు. అత్యధికంగా 45.9% మత సంస్థలకు, 41.8% భిక్షాటకులకు, 14.9% మతేతర సంస్థలు, ఎన్జీఓలకు, 9.1% కుటుంబ సభ్యులకు తెలిసిన వారికి ఇస్తున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, మన దేశంలో దాతృత్వం అనేది బడా సంస్థలు, బిలియనీర్ల చేతుల్లో కంటే సాధారణ ప్రజల దాన గుణమే ఎక్కువగా ఉంది. ఇది మనదేశంలో ఉన్న అందరికీ సాంస్కృతికంగా ఎన్నో ఏళ్ల కిందట నుండి ఉన్న దయాగుణాన్ని చెప్పకనే చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ధనవంతులు కాకుండా, సాధారణులే దేశ దయాగుణానికి నిజమైన ఆధారం.
