* రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేశ్ భగేల్.. ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించారని చెప్పారు. కానీ మన సీఎం మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ఏర్పాటులో ఉన్న త్యాగాల గురించి గానీ, జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అవతరణ, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
——————-