*బల్మూరి వెంకట్ నియామకంతో కమలాపూర్ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్, :
తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగరావు నియామకం పట్ల హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ నాయకుడికి కీలక బాధ్యతలు దక్కడంపై శుక్రవారం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండపు చరణ్ పటేల్ మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమ నేతగా పార్టీ బలోపేతానికి బల్మూరి వెంకట్ విశేష కృషి చేశారని కొనియాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజలకు అండగా నిలిచిన నాయకుడని, రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆయనకు హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరారు.
మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ మాట్లాడుతూ.. బల్మూరి వెంకట్‌కు విప్ పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని నిరూపితమైందన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, విద్యార్థి నాయకుడిగా ఆయన యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవస్థానం డైరెక్టర్ రిక్కల నారాయణ రెడ్డి, దేశరాజ్ పల్లి సర్పంచ్ మిట్టపల్లి కుమారస్వామి, మాట్ల రవీందర్, కొండా తిరుపతి, పాక రాజు, కడారి వెంకటేష్ పాల్గొన్నారు. వీరితో పాటు NSUI నాయకులు హనుమాన్ ప్రసాద్, బొంకూర్ కుమార్, వొళ్లాల శ్రీనివాస్, మాట్ల రాజేష్, శనిగరపు దినేష్, అంజద్, పోతిరెడ్డి ఓదెలు, గోల్కొండ దిలీప్, బోయిని శ్రీనివాస్, కట్కూరి ప్రభాకర్ రెడ్డి, ఎల్కటి అశోక్, రాజు, సాంబయ్య, తిరుపతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
