ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు రోడ్డు ప్రమాదం
* తిరుమల నుంచి వస్తుండగా లారీ ఢీ
* స్వల్ప గాయాలతో బయటపడిన బల్మూరి వెంకట్ దంపతులు
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బల్మూరి వెంకట్ (Balmuri Venkat Car Accident) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే ఈ ఘటనలో బల్మూరి వెంకట్, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న ఆయన సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌కు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు (Rangareddy Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం లేదా ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్ప గాయాలతో బయటపడటం ఊరటనిచ్చింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

