*మక్కల కొనుగోళ్లకు రెడీ
*మార్కెట్ ను సందర్శించిన డిఎం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి ఫలించింది. శాసనసభ సమావేశాల్లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ దిశగా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేసేందుకు సర్కార్ సిద్ధం అయ్యింది. ఆ మేరకు
వ్యవసాయ మార్కెట్ ను మార్క్ ఫెడ్ డిఎం ఎడ్ల రంజిత్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మొక్కల కొనుగోలు, నిలువ, రవాణా మొదలైన సదుపాయాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈనెల 23న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యేతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయను నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా డిఎం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మక్కలు14 లోపు తేమ శాతం ఉంటే క్వింటాకు 2400 మద్దతు ధర రైతులకు లభిస్తుంది అన్నారు. మధ్య దళారీలకు అమ్మి రైతులు నష్టపోకుండా మక్కల కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మార్కెట్ చైర్పర్సన్ లావణ్య మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈ అంశాన్ని లేవనెత్తడం, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వారి వెంట మార్కెట్ డైరెక్టర్ మాచర్ల కుమారస్వామి, రాజశేఖర్ ఒడిసిఎంఎస్ ఇంచార్జ్ సంతోష్ ఉన్నారు.
